ETV Bharat / state

Damaged Roads: చెరువుల్లా మారిన రహదారులు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం..

Highly Damaged Roads: శ్రీకాకుళం జిల్లాలో రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. ఆ రోడ్లపై ప్రయాణం చేస్తే ప్రమాదాలకు గురవుతున్నామని, వాహనాలు దెబ్బతింటున్నాయని ప్రయాణికులు అంటున్నారు. భారీ గుంతలు ఏర్పడి రోజుకు కనీసం రెండు ప్రమాదాలైనా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Highly Damaged Roads
చెరువుల్లా మారిన రహదారులు
author img

By

Published : Jul 26, 2023, 1:33 PM IST

Roads Damaged in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో పట్టణ, గ్రామాలు అని తేడా లేకుండా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిన్నసైజు చెరువుల్ని తలపిస్తున్నాయి. దాంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని జంకుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకుల హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో.. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు ఉన్న వాటికీ మరమ్మతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 శాతం రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు రోజూ తిరిగే రహదారుల పరిస్థితీ మారడంలేదు. స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గమైన ఆమదాలవలసలో.. శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ దారిలో కొల్లివలస కూడలి వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయం పుడుతోందని... స్థానికులు వాపోతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనడానికి తరచూ తమ్మినేని సీతారాం రోజూ ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నా.. ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని... స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాలకొల్లు నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి.. గుంతలమయంగా మారిందని.. పట్టించుకున్న నాథుడే లేడని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు. ఫ్యామీలితో కలిసి వెళ్లినప్పుడు ఈ గుంతల రోడ్ల గుండా వెళ్తే ఎక్కడు అదుపుతప్పి కిందపడిపోతమో అని భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ గుంతల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లోనూ అనేక గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా తమ గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడమే తప్ప పరిష్కారం చూపించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.