శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పేదప్రజలకు పట్టణంలోని ఓ ప్రైవెేట్ స్కూల్ యాజమాన్యం సరుకులు పంపిణీ చేసింది. కరోనా వ్యాప్తితో లాక్డౌన్ అమలవుతున్న వేళ ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు సహాయం అందించారు. రేగిడి, వంగర, రాజాం, సంతకవిటి, తెర్లాం మండలాలకు చెందిన గ్రామస్థులకు సరుకులు అందించారు. వీటి కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు స్కూల్ చైర్మన్ అల్లాడ జనార్థన్ తెలిపారు. అలాగే 41 మంది జర్నలిస్టులకు సరుకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: రాత్రి 8 గంటలకు మోదీ ప్రసంగం- లాక్డౌన్పై ప్రకటన!