శ్రీకాకుళం జిల్లా రాజాంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటపాటు ఈదురు గాలులతో కురిసిన వానకు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజాం నియోజకవర్గంలో సంతకవిటి, రాజాం, రేగిడి, వంగర మండలాల్లో వాన పడింది. అయితే వర్షం రాక రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. వేసవిలో సాగు చేసే పైరు పంటలకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: