శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రానైట్ పరిశ్రమలో రాజస్థాన్‌కు చెందిన 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లోక్డౌన్ కారణంగా తమ స్వస్థలానికి వెళ్లేందుకు వారంతా లారీలో బయల్దేరారు. జిల్లా మలియపుట్టి మండలంలోని వసుందర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లారీని నిలిపివేసి, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోటబొమ్మాలిలో క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి : ఈ నాలుగు సూత్రాలు పాటించండి.. కరోనాను అరికట్టండి!