శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా మూతపడిన బంగారు, వస్త్ర దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో తెరుచుకున్న దుకాణాలకు కొనుగోలుదారులు క్యూ కట్టారు. భారీగా వినియోగదారులు రావటంతో షాపుల వద్ద నిబంధనలు పాటించలేదు.
దీంతో పోలీసులు జోక్యం చేసుకుని దుకాణాల వద్ద పరిస్థితిని అదుపు చేశారు. జాగ్రత్తలు పాటించని వారిని బయటికి పంపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి... అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీర్ మృతి