ETV Bharat / state

తమ్ముడిని కాపాడింది...తను ప్రాణాలు వదిలింది - Girl died in Vamsadhara river in Srikakulam

తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో ఓ బాలిక వంశధార నదిలో పడి మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో చోటుచేసుుకుంది.

Girl died in Vamsadhara river
Girl died in Vamsadhara river
author img

By

Published : May 2, 2021, 9:31 AM IST

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఓ బాలిక ప్రమాదవశాత్తు వంశధార నదిలో పడి మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే...

కొత్తూరు మండలం ఆకుల తంపర గ్రామానికి చెందిన నక్క ప్రశాంతి.. తమ్ముడు దినేష్​తో కలిసి శనివారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న వంశధార నది వద్దకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో మునిగిపోగా.. అతడిని కాపాడే క్రమంలో ప్రశాంతి నదిలోనికి దిగింది. తమ్ముడిని బయటికి పంపించి.. తను కూడా ఒడ్డుకు చేరుకున్నప్పటికీ ఎక్కువగా నీరు తాగడం వల్ల స్పృహ కోల్పోయింది. స్థానికులు గుర్తించి హిరమండలం పీహెచ్​సీకి.. అనంతరం పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నక్క ప్రశాంతి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు భాస్కరరావు, సుజాత జరిగిన సంఘటనపై రోదిస్తున్నారు.

ఇదీ చదవండి: అందరూ చూస్తుండగానే.. గ్రామం మధ్యలో విద్యార్థి హత్య..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.