ETV Bharat / state

యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని... లక్షలు దోచేశాడు

author img

By

Published : Aug 20, 2019, 7:04 AM IST

ఓ విద్యార్థినికి యానివర్సిటీలో వెటర్నరీ సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దానికి 2 లక్షలు ఖర్చవుతుందని డిమాండ్ చేశాడు. అది నమ్మి డబ్బు అతని ఖాతాలో జమ చేసినా విద్యార్థినికి సీటురాకపోగా.. ఫోన్​లో అందుబాటులోకి రాకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా...మోసగాడి అసలు రూపం బయటపడింది.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ

కర్ణాటక యూనివర్సిటీలో వెటర్నరీ సీటు ఇప్పిస్తానని విద్యార్థిని నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఓ విద్యార్థిని నీట్ పరీక్ష రాసింది. పరీక్షలో ర్యాంకు రాకపోవటంతో సదరు వ్యక్తిని సంప్రదించింది. చత్తీస్​ఘడ్ దుర్గ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ సింగ్ కర్నాటక యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు.సీటుకోసం 2 లక్షలు, కన్సల్టింగ్ రుసుం కింద మరో 45 వేలు ఇవ్వాలని కోరాడు. అతడి మాయమాటలు నమ్మిన బాధితురాలు జూన్​లో 2 లక్షలు ఖాతాలో జమ చేసింది. నెలలు గడుస్తున్నా..సీటు విషయం తేలకపోగా..ఫోన్​లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయానని బాధితురాలు గ్రహించింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించి వివరాలు వెల్లడించింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి

సఫారీ కారన్నారు..అంతలోనే షాక్ ఇచ్చారు

Intro:Ap_Vsp_91_19_Dalith_Sangala_Agitation_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటి
8008013325
( ) ఎస్సీ,ఎస్టీ నకిలీ కులధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.

Body:డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆలిండియా దళిత రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ వారంతా నినాదాలు చేశారు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కును కొంతమంది అగ్రకులాలకు చెందిన వారు అధికారు అండతో నకిలీ ఎస్సీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారని వారు ఆరోపించారు.

Conclusion:ఇప్పటికే కోర్టులలో అనేక కేసులు నమోదయ్యాయని.. వాటిపై స్టే విధించకుండా సత్వరమే అన్ని జిల్లాల కలెక్టర్లు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారిని అలాగే వారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిని అరెస్టు చేసి వారి ఉద్యోగాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బైట్ : దళిత సంఘం నాయకుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.