పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఏడాదంతా గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం సముద్రతీరంలో వాలిపోయారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. సరదగా సముద్రంలో స్నానానికి దిగి కాసేపు ఎంజాయ్ చేశారు. అంతా ఆనందంలో మునిగితేలుతుండగా..వారిపై గంగమ్మ కన్నెర్ర చేసింది. ఒకరి పుట్టిన రోజు నలుగురికి చివరిరోజుగా మారింది. సముద్రంలో గల్లంతై..నలుగురు ప్రాణాలు విడిచారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కల్లపాలెం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా..మరొకరి కోసం గాలింపు చేపట్టారు. సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా విషాదం జరిగింది. మృతులు బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన సాయిలోకేశ్ (20), తిరుమల (17), మనోజ్‌కుమార్ (21)గా గుర్తించారు. మరో యువకుడు గోపీచంద్ (18) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యువకుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి