శ్రీకాకుళం జిల్లా రాజకీయ దురంధరుడు, మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. శ్రీకాకుళం కిమ్స్ రహదారిలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సభాపతి తమ్మినేని సీతారాం, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కీర్తిప్రతిష్టలను రాష్ట్రం మొత్తం చాటి చెప్పిన వ్యక్తిగా శ్రీరాములు నిలుస్తారని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ అన్నారు. రాజకీయాల్లో ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
గొర్లె శ్రీరాముల నాయుడు తిరుగులేని ప్రజానాయకుడుగా ఎదిగిన మహావ్యక్తి అన్న సభాపతి.. ఎంతోమందికి రాజకీయ గురువుగా నిలిచారన్నారు. మంత్రిగానే కాక.. శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా 18 ఏళ్ళపాటు సుదీర్ఘకాలం సేవలందించిన గొప్పవ్యక్తి అని సభాపతి తమ్మినేని సీతారాం కొనియాడారు.
ఇదీ చదవండి: విశాఖ జేసీ వేణుగోపాల్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా: బండారు