శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డి.మత్యలేశం, కె.మత్యలేశం, ముద్దాడ గ్రామాలకు చెందిన 20 మంది మత్స్యకారులు నవంబర్ 2018 లో గుజరాత్లోని హిరవలిలో చేపల వేటకు వెళ్లారు. సముద్రజలాల్లో ప్రవేశించి పొరపాటున పాకిస్తాన్ భద్రత దళాలకు చిక్కారు. అప్పట్నుంచి కరాచీ ప్రాంతంలోని లంథి జైల్లో బందీలుగా ఉన్నారు. మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేయడంతో సోమవారం భారత భూభాగంలో అడుగు పెట్టారు. విషయం తెలిసిన మత్స్యకార కుటుంబాలు ఆయా గ్రామాల్లో సంబరాలు చేసుకున్నాయి. ఆనందంతో కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన వారితో కుటుంబ సభ్యులు ఫోన్లో మాట్లాడారు. తమవారిని ఎప్పుడు చూస్తామా అన్న ఆరాటాన్ని వ్యక్తపరిచారు.
ఇదీ చదవండి: