శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన మడ్డు అప్పన్న చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఎప్పటిలాగానే తన పడవను తీసుకొని తెల్లవారుజామున సముద్రంలోకి వేటకు వెళ్లాడు.
చేపల వేట చేసుకొని ఇంటికి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో అలలు ఉద్ధృతికి... ఒక్కసారిగా పడవ బోల్తా పడి... అప్పన్నను ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అప్పన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎచ్చెర్ల పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు.. నలుగురు అరెస్టు