శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో... ఇళ్లలో ఉన్న సామగ్రితో పాటు బియ్యం, నగదు, విలువైన వస్తువులు, భూమి పత్రాలు ఇతర వస్తు సామాగ్రి కాలి బుడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.25 లక్షలు వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని భాదితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: