Farmers who said they could not give land: శ్రీకాకుళం జిల్లా.. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పునరావాస కాలనీకి భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామ సచివాలయంలో సబ్‌కలెక్టర్ రాహుల్ అధ్యక్షతన రైతులతో గ్రామసభ నిర్వహించారు. తరతరాలుగా ఈ భూములు నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నమని రైతులు తెలిపారు. ఇక్కడ పోర్టు పునరావాస కాలనీ నిర్మించాలన్న ఆలోచనను విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణానికి అయితే భూములు ఇస్తాం తప్ప పునరావాస కాలనీకి ఇవ్వలేమని 84 మంది రైతులు తేల్చి చెప్పారు. పునరావాస కాలనీకి భూములు ఇస్తే కూలీలుగా మారిపోతామని....... నౌపడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అభిప్రాయం తీసుకోకుండా మెండిగా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: