ETV Bharat / state

Paddy Problem: లక్ష్యానికి దూరంగా రైతు భరోసా కేంద్రాలు.. - శ్రీకాకుళంలో రైతుల సమస్యలు

Paddy Purchasing Problem: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. పంటను అమ్ముకునేందుకు వేరే మార్గం లేక దళారుల వద్దకు వెళ్తున్నారు. దళారుల ఆగడాలను అరికట్టడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అది ఆశించినంత ఫలితం ఇవ్వటం లేదు. ఉన్న ధాన్యం ఎప్పుడు కొంటారో, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతున్నారు.

Paddy Purchasing Problem
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతోన్న రైతు భరోసా కేంద్రాలు
author img

By

Published : Mar 7, 2022, 9:57 PM IST

Paddy Problem: శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో దళారులదే పైచేయి అవుతోంది. మిల్లర్ల ముసుగులో కొందరు రైతులను నిండా ముంచేస్తున్నారు. వీరి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ధాన్యాన్ని ఈసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను అధికారులు ఆలస్యంగా ప్రారంభించారు. దీనికి తోడు మిల్లర్లకు సార్టెక్స్, నాన్ సార్టెక్స్ మెలిక పెట్టారు. దీని వల్ల కొనుగోళ్లకు మరికొంత ఆలస్యమైంది. జిల్లాలో 319 రైసు మిల్లులు ఉంటే అందులో నాన్‌సార్టెక్స్‌ 150కి పైగా ఉన్నాయి. వీటిద్వారా ధాన్యం సేకరణను ప్రస్తుతం నిలిపేశారు. ఇదే అదనుగా వీరంతా దళారులను రంగంలోకి దించి ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోళ్లు చేయిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతోన్న రైతు భరోసా కేంద్రాలు

జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. 7లక్షల 80వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకు 5 లక్షల 42 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. విధిలేని పరిస్థితుల్లో మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని తీసుకెళ్తున్నామని రైతులు చెబుతున్నారు. పాలకొండ, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో ధాన్యం కొనేవారు లేక ఇంకా పొలాల్లోనే రాసులు ఉన్నాయని రైతులు వాపోతున్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్ని చోట్ల ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3 వందల 16 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇంకా 550కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయాల్సి ఉంది. పంట విక్రయించిన 21 రోజుల్లోపు ఖాతాలో డబ్బులు వేస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.

రైతు భరోసా కేెంద్రాల ద్వారా కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనే నిబంధన ఉన్నా అదీ అమలవడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై అధికారపార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పరిస్థితి మెరుగు పడటంలేదని రైతులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: cabinet Meeting : రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్ధూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.