శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వ్యవసాయ కార్యాలయంలో విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతుల పెద్ద ఎత్తున రావడంతో రైతులు విత్తనాల కోసం బారులు తీరాల్సి వచ్చింది. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల వ్యవసాయ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు బుధవారం నాటికి విత్తనాలు పంపిణీ చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఇదీచదవండి