శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్‌లో ఓ రైతు హల్చల్ చేశాడు. దల్లలవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు తనకు రైతు భరోసా నగదు ఇంకా అందలేదంటూ వ్యవసాయ అధికారిపై తిరగబడ్డాడు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిప్పించుకుంటారని వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణలో తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మిమ్మల్నీ చేయాలని బెదిరించాడు. దీనిపై ఆందోళన చెందిన అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఏవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: