ETV Bharat / state

పొలానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి - పొలానికి వెళ్లిన పెద్ద భీంపురం రైతు విద్యుదాఘాతంతో మృతి

వేరుశనగ పంటను జంతువుల బారినుంచి రక్షించుకోవడానికి పెట్టిన కరెంటు తీగలకు ఓ రైతు బలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్ద భీంపురం గిరిజన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వరిపంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన క్రమంలో తీగలు కాలికి తగిలి.. గొడ్డ సింహాచలం మరణించినట్లు పోలీసులు తెలిపారు.

farmer died, electric shock to farmer
టెక్కలిలో విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Mar 25, 2021, 10:24 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్ద భీంపురం గిరిజన ప్రాంతానికి చెందిన రైతు గొడ్డ సింహాచలం (35) విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఓ పొలంలో వేరుశనగ పంటను జంతువులు నాశనం చేయకుండా రక్షణగా పెట్టిన కరెంటు తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వరి పంటకు నీరు పెట్టేందుకు రైతు వెళ్లిన సమయంలో.. విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని టెక్కలి సీఐ నీలయ్య, ఎస్సైలు కామేశ్వరరావు, గోపాలరావు పరిశీలించారు. పొలం చుట్టూ ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు పెట్టిన మాధవరావుపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఇచ్ఛాపురంలో కరోనాపై అవగాహన ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.