ETV Bharat / state

ఛైర్‌పర్సన్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు - ex officio votes news

ఓట్ల లెక్కింపునకు ఒక్క రోజే గడువు మిగిలి ఉంది. ఫలితాలపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో మూడు చోట్ల ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఛైర్‌పర్సన్‌ను కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. వీరితోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ప్రజాప్రతినిధులు ఉంటారు.

ex officio votes
ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు
author img

By

Published : Mar 13, 2021, 4:38 PM IST

ఛైర్‌పర్సన్‌ను కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. ఇరు పార్టీలకు సమాన మద్దతు ఉన్నప్పుడు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఓటింగ్​లో పాల్గొంటారు.

ఎక్స్‌అఫీషియో ఎవరంటే.. పురపాలక, నగరపంచాయతీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉంటారు. శాసనసభ, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ, శాసనమండలి సభ్యులు ఇందులో ఉంటారు. రాజ్యసభ సభ్యుడు తప్ప మిగిలిన సభ్యులంతా తమ నియోజకవర్గ పరిధిలోని పురపాలక, నగరపంచాయతీల్లో మాత్రమే ఛైర్‌పర్సన్‌ ఎంపికలో ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. వీరు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ముందుగా సంబంధిత పురపాలక, నగర పంచాయతీల్లో తమ ఓటుహక్కు ఎక్కడ వినియోగించుకుంటామో అధికారులకు తెలియజేయాలి. తమ పరిధిలో ఒక్క చోట మాత్రమే వీరు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఎన్నికలు జరిగిన పాలకొండ, ఇచ్ఛాపురం, పలాసలో ముగ్గురు శాసనసభ్యులు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరంతా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులకు లిఖితపూర్వక వివరాలు అందించారు. మంత్రి అప్పలరాజు పలాసలో, ఎమ్మెల్యేలు కళావతి పాలకొండలో, అశోక్‌ ఇచ్ఛాపురంలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇంత వరకు ఏ పురపాలక సంఘానికి తన ఓటుహక్కుపై దరఖాస్తు చేసుకోలేదు. అరకు ఎంపీ జి.మాధవి సాలూరులో ఎక్స్‌అఫీషియోగా తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు ఎక్స్‌అఫీషియోలుగా వస్తారు.
సమానంగా వస్తే..: ఛైర్‌పర్సన్‌ పీఠం కైవసం చేసుకునేందుకు ఎక్స్‌అఫిషియో ఓట్లు కీలకం. ఇరు పార్టీలకు సమానంగా కౌన్సిలర్లు మద్దతు ఇచ్చిన సమయంలో ఛైర్సపర్సన్‌ అభ్యర్థి ఎంపికలో వీరు పాల్గొంటారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎన్నికలు ముగిసి 48 గంటలు కాకముందే ప్రజలపై దాడులా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.