శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం హోంజరాం గ్రామంలో.. ఇళ్ల పట్టాల కోసం గ్రామ సచివాలయం వద్ద లబ్ధిదారులు నిరసన చేశారు. 2016లో తెదేపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ అంశంపై అర్హులు కోర్టుకు సైతం వెళ్లారు.
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైకోర్టు నుంచి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. వీటిని ఖాతరు చేయకండా ఆలస్యం చేయడంపై లబ్ధిదారులు నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
BEACH CORRIDOR: విశాఖ బీచ్ కారిడార్లో పర్యాటకం పరుగులు.. అభివృద్ధికి సర్కారు చర్యలు