శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు... రెండు రోజులు కిందట వీరఘట్టం మండలంలోని కడకెల్ల, చిట్టిపూడివలస గ్రామాల్లో పంటలు నాశనం చేశాయి. ఏనుగులు అక్కడినుంచి పాలకొండ మండలం సీతంపేట గ్రామానికి చేరాయి...వీటిని గమనించిన గ్రామస్తులు బాణాసంచా కాల్చడంతో అవి బడ్డుమాసింగి గ్రామానికి చేరుకున్నాయి. ఈ గ్రామానికి సమీపంలో చెరుకు తోటలు ఉండడంతో ఏనుగులు అక్కడే తిష్ట వేశాయి. గ్రామ సమీపంలోనే గుంపు సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: జిల్లాలో ఏనుగుల హల్చల్.. చెరకు తోటలు ధ్వంసం