శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో ఉన్న తాగునీటి వనరుల వద్ద మురుగునీటి నిల్వలు పేరుకుపోయాయి. తాగునీరు కలుషితమైన కారణంగా.. 70 మంది వరకు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ప్రతి ఇంట్లో అతిసారంతో బాధపడుతున్నారు.
జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) రవికుమార్, అదనపు డి.ఏం.హెచ్.వో జగన్నాథరావులు గ్రామాన్ని సందర్శించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక వైద్య అధికారులను ఆదేశించారు.
గ్రామంలో డయేరియా తగ్గుముఖం పట్టే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు. తక్షణమే పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టాలని మండల అధికారులకు డీపీవో ఆదేశించారు. చేతిపంపుల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామన్నారు.
ఇదీ చూడండి: