శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని దుకాణాల వద్ద.. మందుబాబులు బారులు తీరారు. జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 11గంటల వరకే మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజామునే దుకాణాల వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరాన్ని విస్మరించి గుంపులుగా ఎగబడ్డారు. కొందరు మాస్క్ లు ధరించడంలోనూ నిర్లక్ష్యం వహించారు.
పోలీసులు వారిని అదుపుచేయడానికి ప్రయత్నించినా..ఫలితం లేకపోయింది. జనాలు ఇలా గుంపులుగా చేరటం వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి