ETV Bharat / state

ఇచ్చాపురంలో లాక్​డౌన్​పై కలెక్టర్​ పరిశీలన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కలెక్టర్​ నివాస్​ పర్యటించారు. ఇచ్చాపురంలో లాక్​డౌన్ ప్రకటించాలా? వద్దా ? అనే దానిపై కంటెయిన్​మెంట్​ జోన్లలో పరిస్థితి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్​డౌన్ ప్రకటించినా నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్​ స్పష్టం చేశారు.

district collector visited icchapuram
ఇచ్చాపురంలో లాక్​డౌన్​పై కలెక్టర్​ పరిశీలన
author img

By

Published : Jul 6, 2020, 10:44 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో లాక్​డౌన్ ప్రకటించే విషయమై ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇచ్చాపురం మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కొందరు రోగులు నిర్లక్ష్యంతో చివరి నిమిషంలో ఆస్పత్రులకు రావడం వల్ల మృతి చెందుతున్నారని తెలిపారు.

ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతంలో ఉండడం, వలస కూలీలు ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు నమోదు అవుతున్నాయని కలెక్టర్​ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం.వినోద్ బాబు, తహసీల్దార్ అమల, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

గర్భిణి అయిన భార్యను చూసేందుకు వెళ్తూ... మృత్యు ఒడికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.