రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీలపై సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్‌తో కలిసి ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ సమీక్షించారు.
జగనన్న కాలనీలు నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి అధికారులను కోరారు. ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో ఇళ్ల నిర్మాణాల చేపట్టడం కష్టతరమేనన్న కృష్ణదాస్.. అధికారులు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.
ఇదీ చదవండి: