పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు నుంచి వైకాపా తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సుడియా సురేష్.. యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఆయన కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సురేష్.. ఓటు ఉన్నవారి జాబితా ప్రకారం బ్యాట్లు, క్రికెట్ కిట్లను పేర్లవారీగా పంపిణీ చేశారు. బహిరంగంగా పంపిణీ చేసినప్పటికీ.. ఏ అధికారి పట్టించుకోలేదని.. పలువురు విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?