శ్రీకాకుళంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కొవిడ్ వైద్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. మహమ్మారి సమయంలో సేవలందించిన వారికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇంటి ఖర్చులకు అప్పులు చేశామని...ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళంలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ర్యాలీ