శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై కరోనా వైరస్ పంజా విసిరింది. మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 20 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. మరో 13 మంది విద్యార్థులకూ కొవిడ్ సోకింది.
మడపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు బలివాడ వాసుదేవరావు ఇవాళ వైరస్ కారణంగా కన్నుమూశారు. ఇదే పాఠశాల నుంచి మరో ఐదుగురు ఉపాధ్యాయులు సైతం కరోనా బారినపడ్డారు.
ఇదీ చదవండి: