శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలంలో ఒక్క రోజే 20 కరోనా కేసులు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు 14 కేసులు గుర్తించగా శనివారం ఒక్క రోజే సంతకవిటి మండల కేంద్రంలో 11, ఎమ్మార్ అగ్రహారం 8, సిరిపురంలో ఓ కేసు నమోదైంది. దీంతో ఆ మండలంలో ప్రస్తుతం 34 కరోనా కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు ఆందోళన పడుతున్నారు.
కరోనా కేసులు నమోదైన కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరో పక్క సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వరం లక్షణాలు ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యం, క్లోరినేషన్ వంటి పనులను చేపడుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ జరిగిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి :