శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో కంటైన్మెంట్ గ్రామాలను తగ్గిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి 11 గ్రామాల్లో ఆంక్షలు సడలిస్తున్నట్టు తెలిపారు. పాతపట్నం మండలంలో గత నెల 24వ తేదీన కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో 18 గ్రామాలను కంటైన్మెంట్ గ్రామాలుగా గుర్తించారు.
అనంతరం ఆదివారం 11 గ్రామాలకు అధికారులు సడలింపు చేశారు. దీంతో పాతపట్నంతో పాటు మరికొన్ని గ్రామాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. మిగతా ఏడు గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ కొనసాగుతోందని.. ఆంక్షల యథావిధిగా అమలవుతాయని తహసీల్దార్ కాళీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:
పోలవరం పరవళ్లకు కరోనా అడ్డు