ETV Bharat / state

PETROL : పెట్రోల్ కల్తీ... వినియోగదారుల ఆగ్రహం - srikakulam crime

శ్రీకాకుళంలోని ఓ పెట్రోల్ బంక్​లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళంలో పెట్రోల్ లో వాటల్ పోసి కల్తీ

author img

By

Published : Oct 17, 2021, 4:10 PM IST

శ్రీకాకుళంలోని రైతు బజార్‌ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్‌ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వ్యక్తి... అతని కారులో ఫుల్‌ ట్యాంక్ పెట్రోల్‌ కొట్టించుకున్నాడు. 300మీటర్లు వెళ్లగానే కారు ఆగిపోయింది. ఈ విషయమై వాహనదారుడు మెకానిక్‌ను సంప్రదించగా.. పెట్రోల్‌లో నీరు చేరి కల్తీ అయ్యిందని చెప్పారు. దీనిపై పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపాడు. సిబ్బంది తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన కారు యజమాని, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో డీఎస్వో రమణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

ఇదీచదవండి. South Central Railway: దసరా ప్రయాణికుల కోసం.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.