సమావేశంలో మాట్లాడుతున్న కళా వెంకట్రావు వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప సాధించిందేమీ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో కార్మికులకు రోజుకి రూ. 200 కోట్లు నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు.
ఇదీ చూడండి
మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి'