శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సభాపతి తమ్మినేని సీతారాం హాజరైన ఓ శంకుస్థాపన కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు కంచరావువానిపేట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి స్పీకర్ వచ్చారు.
అంతర్గత కలహాల వల్ల..
ఈ నేపథ్యంలో అంతర్గత కలహాలతో అధికార పార్టీలోని ఇరువర్గాల మధ్య తలెత్తిన విబేధాలు చినికి చినికి గాలివానగా మారి.. తోపులాటకు దారితీసింది. కార్యకర్తలతో పాటు నాయకుల్లోనూ వివాదం ముదరడంతో శాసనసభాపతి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.