శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ అచ్చయ్యతో పాటు ఆయన తమ్ముడు సూర్యనారాయణ, మరదలు ఊర్మిళపై దాడి చేశారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం కిమ్స్ తరలించారు. తెదేపా వర్గీయులే దాడి చేశారని గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: వారితో యుద్ధం చేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి: సీఎం