ETV Bharat / state

హెపటైటిస్‌-బి బాధితులకు అందని పూర్తి స్థాయి చికిత్స - Hepatitis-B sufferers do not need complete treatment

ఆ వ్యాధి సోకిదంటే బాధితులు పొరుగు ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే. లేకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో హెపటైటిస్‌-బి కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒకసారి ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదమూ ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంతటి తీవ్ర పరిస్థితి ఉన్న జిల్లాలో ప్రభుత్వ పరంగా బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందని పరిస్థితి నెలకొంది.

Complete treatment
అందని పూర్తి స్థాయి చికిత్స
author img

By

Published : Dec 4, 2020, 7:40 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నెలా వందల మంది హెపటైటిస్‌-బి సమస్యతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇది కొందరిలో మందులతో నయమవుతుంది. మిగిలినవారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా డబ్బులు కావాలి. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ వైద్య నిపుణులు లేకపోవడంతో బాధితులు ప్రయివేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడా నయంకాకపోతే విశాఖపట్నం, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను కేటాయించి చికిత్స అందిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో పచ్చకామెర్లతో బాధపడేవారు ప్రైవేటు వైద్యులు, నాటు, ఆయుర్వేదం వైద్యుల వద్ద మందులు తీసుకుని స్వాంతన పొందుతున్నారు.

కారణాలు: హెపటైటిస్‌-బి కొందరికి పుట్టుకతో వస్తుంది. మరికొందరికి రక్తమార్పిడి, లైంగిక సంబంధాలు, శస్త్ర చికిత్సలు చేసే సమయాల్లో ఈ వైరస్‌ సోకే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

Complete treatment
వివరాలు

ప్రభుత్వానికి తెలియజేశాం..

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం లేకపోవడంతో మెడిసిన్‌ విభాగం వైద్యులు పరీక్షలు చేసి, మందులు రాస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వానికి తెలియజేశాం. ప్రత్యేక వైద్యుడిని కేటాయిస్తే జిల్లావాసులకు చికిత్స అందించే వీలుంటుందని ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పటికీ ఆసుపత్రికి నిత్యం 20 నుంచి 30 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నవారు వస్తున్నారు. వీరిలో అత్యవసరమైనవారిని విశాఖ కేజీహెచ్‌కు పంపిస్తున్నాం.

- డాక్టర్‌ ఎ.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, శ్రీకాకుళం

ఇదీ చదవండి:

రైతులకు మద్దతు..ఆశావర్కర్ల యూనియన్​ ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.