విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామ వైద్య విద్యార్థి అన్నపు చంద్రమౌళి కుటుంబానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్, ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. మృతుడి కుంటుబ సభ్యులను ఓదార్చిన మంత్రి వారిలో ధైర్యాన్ని నింపారు. విశాఖ విషవాయువు ఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.
ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబానికి పరిహారం అందజేత
ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విషవాయువు ఘటనలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామ వైద్య విద్యార్థి అన్నపు చంద్రమౌళి కుటుంబానికి మంత్రి కోటి రూపాయల చెక్కును అందజేశారు.