Teacher Suspect Died in School at Annamayya District : అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తరగతి గదిలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడం పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన ఈరోజు(బుధవారం) సాయంత్రం పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిని వారించే సమయంలో ఉపాధ్యాయుడు అక్కడే కుప్పకూలి పోయాడు. అతన్ని స్థానిక ఉపాధ్యాయులు రాయచోటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విద్యార్థులు కొట్టడం వల్లే! : ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు, పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయుడు భార్య రెహమూన్ భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన భర్తను తరగతి గదిలోనే ముగ్గురు విద్యార్థులు శరీరం పైన, ఛాతీ పైన బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆమె ఆరోపించారు. పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు అంటున్నట్లుగా తన భర్త గుండెపోటుతో చనిపోలేదన్నారు. విద్యార్థులు కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫుడ్‌పాయిజన్‌తో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి - 21రోజులు వెంటిలేటర్‌పైనే
వారిని ఎందుకు కాపాడుతున్నారు : తాను కూడా మరో పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నానని, తన భర్తను చిన్నపిల్లాడిగా చూసుకుంటున్నానని తెలిపారు. తన భర్తకు ఎలాంటి జబ్బు లేదని కంటతడి పెట్టారు. తన భర్తకు చావుకు కారణమైన వారిని పాఠశాల ఉపాధ్యాయులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయం తేలకపోతే తాను కూడా అనుమానం ఉన్న వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాపోయారు. ఆమె అనుమానాలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేయడంతో మృతదేహాన్ని రాత్రి 10 గంటలకు తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. రేపు(గురువారం) ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూలీల ఆటోను ఢీకొట్టిన బస్సు - 8 మంది దుర్మరణం - సీఎం దిగ్భ్రాంతి
Teacher: తొమ్మిది నెలలుగా వేతనాలు లేక... ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి