ETV Bharat / state

'ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించాలి'

ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించేలా చూడాలని అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ నివాస్​ ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటికే జె.ఆర్.పురం గ్రామ ప్రజలు, వ్యాపారులు రెండు రోజులుగా స్వచ్ఛంద బంద్ నిర్వహిస్తున్నారు. రణస్థలంలో జిల్లా కలెక్టర్ పర్యటనలో కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

collectore-nivas-visited-ranastalam
రణస్థలంలో కలెక్టర్​ నివాస్​ పర్యటన
author img

By

Published : Jul 6, 2020, 9:01 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కలెక్టర్​ నివాస్​ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్​లో ఉన్న మరో 50 మందికి మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో రాఫిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ మండల కేంద్రంలో పర్యటించి కరోనాకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంటెన్మెంట్​ జోన్​ల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి... : భూముల కొలతల నిర్వహణ దిశగా ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.