శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నాడు - నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను సూచించారు. మంగళవారం రాత్రి పాలకొండ ఆర్డీవో కార్యాలయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఇసుక కొరత లేకుండా చూడాలని.. కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాఠశాలలు తెరిచే సమయానికి రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అన్నారు.
ఇదీ చదవండి..
పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుంది:రఘురామకృష్ణరాజు