శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేంద్రాల్లో 5వేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పాలనాధికారి నివాస్ తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర, వైష్ణవి కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లను ఆయన పరిశీలించారు. బెడ్లతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాలను కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్ చేయాలన్నారు.
జిల్లాలో మొత్తం 4 వేల 4 వందల 17 కేసులు ఉండగా.. అందులో 2 వేల 57ఆక్టివ్ కేసులు ఉన్నాయని అందులో 898 మంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిను కొవిడ్ ఆసుపత్రిగా మార్చామన్నారు.
ఇదీ చదవండి: