ETV Bharat / state

'లాక్​డౌన్​ ఆంక్షల్లో జిల్లాకు ప్రజలకు కాస్త ఊరట'

లాక్​డౌన్​ ఆంక్షల్లో శ్రీకాకుళం జిల్లాకు కొంత ఉపశమనం లభించనుంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. నేటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్​ నివాస్​ తెలిపారు.

collector given permission to open some shops in srikakulam district
జిల్లాలో ఆంక్షల సడలింపును చెబుతున్నశ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ నివాస్​
author img

By

Published : May 14, 2020, 12:20 PM IST

శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్​ ప్రక్రియలో కొన్ని సవరణలు చేసినట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూరగాయలు, పండ్ల దుకాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఇతర దుకాణాలు తీసుకోవచ్చని చెప్పారు.

జిల్లాలో బట్టలు, బంగారం, చెప్పుల షాపులకు అనుమతి లేవని స్పష్టం చేశారు. క్రయ, వికర్యాలు చేసేవారంతా.. భౌతిక దూరం పాటించి కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలన్నారు. మాస్క్​ ధరించని వారికి వెయ్యి రూపాయల అపరాధ రుసుం వసూలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణానికి సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.