లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని.. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరులో దాదాపు 270 కుటుంబాలకు మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి