ETV Bharat / state

'నిన్నే సర్జరీ అయిందని  చెప్పినా వినలేదు' - అచ్చెన్నాయుడు భార్య విజయతో మాట్లాడిన చంద్రబాబు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని భార్య విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో ఫోన్​లో మాట్లాడిన చంద్రబాబు, లోకేశ్‌... పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

chnadrababu naidu talked with acchhenayudi wife's vijaya in phone
అచ్చెన్నాయుడు భార్య విజయతో మాట్లాడిన చంద్రబాబు
author img

By

Published : Jun 12, 2020, 12:07 PM IST

Updated : Jun 12, 2020, 3:18 PM IST

అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులతో తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌ ఫోన్లో మాట్లాడారు. కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని అచ్చెన్నాయుడి భార్య విజయ తెలిపారు. తమతో మాట్లాడే అవకాశం లేకుండా తీసుకెళ్లారని వాపోయారు.

ఇలాంటి బెదిరంపులకు ఏమి భయపడవద్దని... పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్‌ ఆమెకు భరోసా ఇచ్చారు. కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి అరెస్టులని అన్నారు. ఆధారాల్లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని...అధికారులపై ఎంత ఒత్తిడి ఉందో బయటపడిందని దుయ్యబట్టారు. అచ్చెన్న అరెస్టుతో మరోసారి జగన్ కుట్ర బయటపడిందని ఆయన ధ్వజమెత్తారు.

త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని లోకేశ్‌ అన్నారు.

అచ్చెన్నాయుడు భార్య విజయతో మాట్లాడుతున్న చంద్రబాబు

జనాలందరూ చూస్తున్నారు. ఏమి చెప్పలేదు. మేం లోపలే ఉన్నాము. జనాలందరూ చూస్తూ వీడియో చిత్రీకరిస్తుంటే వాటినీ లాక్కున్నారు సర్. వాళ్లు వెంటనే పైకొచ్చి..ఆరోగ్యం బాగాలేదని అంటున్న తనని కిందకి తీసుకెళ్లారు. తన మాటలు వినబడి బయటికి వచ్చేలోపే తీసుకెళ్లిపోయారు. ఇంటి దగ్గరికి మూడువందల మందికిపైగా వ్యక్తులు వచ్చారు. వారం రోజుల నుంచి బాలేదు అన్న విన్లేదు. ఎవర్ని ఇక్కడికి రానివ్వకుండా పోలీసులు ఉన్నారు సర్. హెడ్​క్వార్టర్​లో జంక్షన్​లో పోలీసులు ఉన్నారు. ఎవర్ని ఇక్కడికి అనుమతించట్లేదు సార్. -చంద్రబాబుతో ఫోన్​లో మాట్లాడిన అచ్చెన్నాయుడి భార్య విజయ

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడి సోదరుడు

అసలూ మాకు మొత్తానికి తెలీదు. ఉదయం హఠాత్తుగా మూడు వందల మందికిపైగా పోలీసులు వచ్చి మా అన్నయ్యను తీసుకెళ్లారు. కొంతమంది గోడలు దూకి లోనికి వచ్చారు. తన భార్యకూ తెలీదు. చూడటానికి సమయం లేదు. మంచినీళ్లు తాగనివ్వలేదు, మందులు వేసుకోనివ్వకుండానే తీసుకెళ్లారు. -మీడియతో అచ్చెన్న సోదరుడు హరివరప్రసాద్

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడి భార్య విజయ

మేము పైగదిలో ఉన్నాం. నా భర్త ఆరోగ్యం బాలేదు. నిన్ననే తనకి సర్జరీ అయింది. స్నానం చేసి... మందులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే 7:20 ప్రాంతంలో అనిశా అధికారులు ఇంట్లోకి వచ్చారు. నా ఆరోగ్యం బాగాలేదు... కనీసం మందులైన వేసుకోనివ్వండని నా భర్త వేడుకున్నా విన్లేదు. బాగాలేని నా భర్తను అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్లిపోయారు. - మీడియాతో అచ్చెన్నాయుడి భార్య విజయ

ఇదీ చూడండి.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

అచ్చెన్నాయుడి కిడ్నాప్​కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు

Last Updated : Jun 12, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.