సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన వర్థంతి సందర్భంగా ట్విటర్లో నివాళులు అర్పించారు. తన కంచు కంఠంతో చట్టసభలలో తెలుగు ప్రజావాణిని బలంగా వినిపించారని, ఆయన స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి మోహన్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేశ్ గుర్తు చేసుకున్నారు. తెదేపా సీనియర్ నేతగా, అయిదుసార్లు శాసనసభ్యునిగా పనిచేసిన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కీర్తించారు.
ఇదీ చదవండి: