శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్‌వాడీ కార్యకర్తలపై బత్తిలి పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 3వ తేదీన బత్తిలి చెక్‌పోస్టు వద్ద చిన్నపిల్లలు, గర్భిణులు పంపిణీ చేయాల్సిన పాలప్యాకెట్లను అక్రమంగా తరలిస్తుండంగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు.. 28 మంది అంగన్‌వాడీ కార్యకర్తలపై 409, 406, 420, 411, 955 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
కొత్తూరు మేజిస్ట్రేట్ కోర్టులో వీరందరినీ హాజరుపరచగా.. ఈనెల 27వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలను అంపోలులోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. దీనిపై వారిని ప్రశ్నించగా భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తమకేమీ తెలియదని, సూపర్‌వైజర్లు, సీడీపీవోలు చేయమంటేనే చేశామని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: