శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావుల గ్రామం వద్ద మేజర్ కాలువపై పంచాయతీరాజ్ రహదారికి అనుసరించి ఉన్న వంతెన ఆదివారం రాత్రి కుప్పకూలింది. ఈ రహదారి మీదుగా టిప్పర్ లారీ వెళుతుండగా వంతెన కాలువలోకి కూలింది. దీంతో లారీ కూడా కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లారీ సిబ్బంది బయటపడ్డారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. వంతెన కూలిపోవడంతో రావుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్లు, ప్రొక్లెయిన్ సాయంతో లారీని బయటికి తీసేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండీ... ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు