ఒకవైపు కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్నప్పటికీ... జనం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా గుంపులు గుంపులుగా ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. తాజాగా... శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వేణుగోపాలపుర గ్రామంలో ఉన్న చెరువులో నీరు ఇంకిపోవడంతో భారీ ఎత్తున చేపలు దొరికాయి. స్థానిక గ్రామపెద్దల సమక్షంలో గ్రామస్థులు చేపలను పట్టుకున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో ప్రజలు భారీ సంఖ్యలో చేపల కోసం చేరువు వద్దకు చేరుకున్నారు. చెరువులో జనం గుంపులు గుంపులుగా కలిసి చేపల వేట సాగిస్తే, కరోనా ప్రభావం ఇక్కడ కనిపించదా..? అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి