శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురుషోత్తపురం గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సరఫరా ట్యాంకర్ కింద రెండేళ్ల బాలుడు దీపక్ ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. రెండు దశాబ్దాలుగా నెలకొన్న నీటి సమస్య వల్లే బాలుడు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు లేదా మంత్రుల ఈ నీటి సమస్యకు స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:కృష్ణానది ఒడ్డున రెండు మృతదేహాలు లభ్యం