ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తేజేశ్వరరావు అనే బాలుడు గ్రామ శివారులో ఆడుకుంటూ...ప్రమాదవశాత్తు బావిలో జారిపడ్డాడు. గమనించిన తోటి స్నేహితులు సహాయక చర్యలు చేపట్టి అతణ్ణి బయటకు తీశారు. అనంతరం పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీచదవండి