భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డీబీఎఫ్ఓటీ ప్రాతిపదికన పీపీపీ ప్రాజెక్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు జీఎంఆర్ సంస్థను నిర్ధరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్ 1 బిడ్డరుగా ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు గానూ 2203.26 ఎకరాలను జీఎంఆర్ సంస్థకు అప్పగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సమీకృత గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌తో పాటు ఏవియేషన్ శిక్షణా సంస్థ, విమానాల నిర్వహణ, రిపేర్లు ఓవర్ హాలీంగ్(ఎంఆర్ఓ) కేంద్రాలను జీఎంఆర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు మిగిలిన 362 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ ఎయిర్ పోర్ట్సు డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు రూ.280 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్‌కు అప్పగింత - Bogapuram Airport
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వాహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్-1 బిడ్డర్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
![భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్‌కు అప్పగింత భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జీఎంఆర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6602049-989-6602049-1585597357859.jpg?imwidth=3840)
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, నిర్వహణలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డీబీఎఫ్ఓటీ ప్రాతిపదికన పీపీపీ ప్రాజెక్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు జీఎంఆర్ సంస్థను నిర్ధరిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఒక్కో ప్రయాణికుడి ఫీజు కింద రూ.303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు రావటంతో జీఎంఆర్ సంస్థను హెచ్ 1 బిడ్డరుగా ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు గానూ 2203.26 ఎకరాలను జీఎంఆర్ సంస్థకు అప్పగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సమీకృత గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌తో పాటు ఏవియేషన్ శిక్షణా సంస్థ, విమానాల నిర్వహణ, రిపేర్లు ఓవర్ హాలీంగ్(ఎంఆర్ఓ) కేంద్రాలను జీఎంఆర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు మిగిలిన 362 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ ఎయిర్ పోర్ట్సు డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు రూ.280 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌తో రంగంలోకి నౌకాదళ విమానం