కరోనా కారణంగా.. రక్తనిల్వలపై ప్రభావం పడిందని రెడ్‌క్రాస్ స్టేట్ వైస్ ఛైర్మన్ జగన్మోహనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారితో సహా అత్యవసర రోగులకు అవసరమైన రక్తం తక్షణం అందించేందుకు వీలు కాని పరిస్థితి నెలకొందన్నారు. గర్భిణులు, తలసేమియా, సికిల్‌సెల్‌సేమియా, ఎముక మజ్జ వ్యాధి బాధితులతోపాటు రక్తహీనతతో బాధపడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా రక్తనిధి నుంచి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితి అని జగన్మోహనరావు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు